పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్ష వధ

  •  
  •  
  •  

3-701-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బుబుడ నెత్తురు గ్రక్కుచు
వెరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం
డి పండ్లు గీటుకొనుచును
విడిచెం బ్రాణములు దైత్యవీరుం డంతన్.

టీకా:

బుడబుడ = బుడబుడమని శబ్దము చేయుచు; నెత్తురు = రక్తము; క్రక్కుచున్ = కక్కుకుంటూ; వెడ = వికృత; రూపమున్ = ఆకారమును; తాల్చి = ధరించి; గ్రుడ్లు = కనుగుడ్లు; వెలి = బయట; కున్ = కి; ఉఱకన్ = ఉబుకొచ్చి; నిలంబడి = ఉండి; పండ్లు = నోటి పండ్లు; గీటుకొనుచున్ = కొరుకుతూ; విడిచెన్ = వదలెను; ప్రాణములు = ప్రాణములు; దైత్యవీరుడు = హిరణ్యాక్షుడు {దైత్యవీరుడు - దైత్యుల (రాక్షసుల)లో వీరుడు, హిరణ్యాక్షుడు}; అంతన్ = అప్పుడు.

భావము:

అప్పుడా రాక్షసవీరుడు బుడబుడమని నెత్తురు కక్కుతూ, వికారమైన ఆకారంతో, కన్నులు బయటికి పొడుచుకురాగా, పండ్లు కొరుకుతూ నేలమీద పడి ప్రాణాలు విడిచాడు.