పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-696-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితి దన విభువాక్యంబుల
తిదప్పద యనుచుఁ దలఁపఁగాఁ జన్నుల శో
ణిధార లొలికె రక్షః
తి యగు కనకాక్షుపతనభావము దోఁపన్.

టీకా:

దితి = దితి; తన = తన; విభు = ప్రభువు; వాక్యంబులన్ = మాటల యొక్క; గతి = ప్రకారము జరుగుట; తప్పద = తప్పదు; అనుచున్ = అని; తలపగాన్ = తలుచుకొనగా; చన్నులన్ = స్తనములనుండి; శోణిత = రక్తపు; ధారల్ = ధారలు; ఒలికెన్ = కారెను; రక్షస = రాక్షసుల; పతి = రాజు; అగు = అయినట్టి; కనకాక్షు = హిరణ్యాక్షుని; పతన = మరణము; భావము = కలుగునను భావము; తోపన్ = తోచగా.

భావము:

తన భర్త అయిన కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని దితి అనుకొంటుండగా హిరణ్యాక్షుని పతనాన్ని సూచిస్తున్నట్లుగా ఆమె పాలిండ్లనుండి రక్తధారలు ప్రవహించాయి.