పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-694-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రభానుదీప్తి ధ
రాక్రమునందు నిండియముననమ్మా
యాక్రమునడఁగించెను
నీక్రముఁడైన యామినీచరు నెదురన్

టీకా:

ఆ = ఆ; చక్ర = చక్రము యొక్క; భాను = సూర్య; దీప్తి = కాంతి; ధరా = భూ; చక్రమున్ = మండలము; అందున్ = అందు; నిండి = నిండిపోయి; రయమునన్ = వేగముగ; ఆ = ఆ; మాయా = మాయల; చక్రమును = దండునంతటిని; అడగించెను = అణచివేసెను; నీచ = నీచమైన; క్రముడు = నడత కలవాడు; ఐన = అయినట్టి; యామినీచరున్ = రాక్షసుని {యామినీ చరుడు - రాత్రి తిరుగువాడు, రాక్షసుడు}; ఎదురన్ = ఎదురుగా.

భావము:

విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయాచక్రాన్ని అతడు చూస్తుండగా అణచివేసింది.