పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-686.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున నడమన వడి ద్రుంచె మరభర్త
హిత దంభోళిచే గరుత్మంతు పక్ష
తిరయంబునఁ ద్రుంచినతిఁ జెలంగి
సురలు మోదింప నసురులు సొంపు డింప.

టీకా:

కాల = ప్రళయకాలపు; అనల = అగ్నివలె; జ్వలత్ = మండుతున్న; జ్వాలా = మంటలతో; విలోల = కంపిస్తున్న; కరాళము = భయంకరము; ఐ = అయ్యి; పెంపొందు = అతిశయించు; శూలమున్ = శూలమును; అంది = అందుకొని; సురవైరి = రాక్షసుడు {సురవైరి - సురలు (దేవతలు) కి అరి (శత్రువు), రాక్షసుడు}; యజ్ఞసూకర = యజ్ఞవరాహము యొక్క; రూప = రూపమును; ధరుడు = ధరించినవాడు; ఐన = అయినట్టి; వనజనాభుని = హరి {వనజనాభుడు - వనజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; మీదన్ = పైన; వైవన్ = వేయగా; అదియునున్ = అదికూడ; సత్ = మంచి; ద్విజ = బ్రాహ్మణులలో; ఉత్తము = ఉత్తముని; మీదన్ = పైన; చపలతన్ = చపలత్వముతో; కావించు = ప్రయోగించబడిన; అభిచారకర్మంబున్ = అభిచారకర్మము {అభిచారకర్మ - హింసార్థమైన తంత్రవిద్య}; అట్ల = వలె; బెండుపడి = వ్యర్థమైపోయి; పఱితేన్ = పరుగెట్టుకొనిరాగా; కని = చూసి; పద్మోదరుడు = వరహావతారుడు {పద్మోదరుడు - పద్మము ఉదరమున కలవాడు, విష్ణువు}; దానిన్ = దానిని; చక్ర = చక్రము యొక్క; ధారా = అంచుతో; హతిన్ = కొట్టెడి; చండ = భయంకరమైన; విక్రమమున = పరాక్రమముతో;
నడమన = మధ్యలోనే; వడిన్ = వేగముగ; త్రుంచెన్ = ముక్కలుచేసెను; అమరభర్త = వరహావతారుడు {అమరభర్త - అమరుల (దేవతల)కి భర్త (ప్రభువు), విష్ణువు}; మహిత = గొప్ప; దంభోళి = వజ్రాయుధము; చేన్ = చేత; గరుత్మంతు = గరుత్మంతుని; పక్షమున్ = ఈకను; అతి = మిక్కిలి; రయంబునన్ = వేగముగ; త్రుంచిన = ముక్కలుచేసిన; గతిన్ = వలె; చెలంగి = చెలరేగి; సురలు = దేవతలు; మోదింపన్ = సంతోషించగా; అసురులు = రాక్షసులు యొక్క; సొంపు = శోభ; డింపన్ = దిగిపోగా.

భావము:

రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపంలో ఉన్న విష్ణువుపై వేశాడు. సద్బ్రాహ్మణునిమీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా; ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచ గలిగినట్లు; హిరణ్యకశిపుని అంతటి శూలమూ వ్యర్థమైపోయింది. విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కన రెండుగా ఖండించాడు. అది చూసి దేవతలకు సంతోషం చెలరేగింది; రాక్షసులకు సంతోషం క్షీణించింది.