పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-684-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితిజుఁడు దన బల మప్రతి
తేజుం డగు సరోరుహాక్షుని శౌర్యో
న్నతిమీఁద బెట్టకుండుట
తి నెఱిఁగియుఁ బెనఁగె దురభిమానముపేర్మిన్.

టీకా:

దితిజుడు = హిరణ్యాక్షుడు {దితిజుడు - దితికి జుడు (పుత్రుడు), హిరణ్యకశిపుడు}; తన = తన యొక్క; బలము = బలము; అప్రతిహత = ఎదురులేని; తేజుండు = తేజస్సు కలవాడు; అగు = అయిన; సరోరుహాక్షుని = వరాహమూర్తి యొక్క {సరోరుహాక్షుడు - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; శౌర్య = పరాక్రమము ను; ఉన్నతిన్ = గొప్పతనమును; మీదపెట్టక = నెగ్గలేక; ఉండుట = పోవుట; మతిన్ = మనసున; ఎఱిగియున్ = తెలిసినను; పెనగెన్ = పెనుగులాడెను; దురభిమానము = దురభిమానము; పేర్మిన్ = అతిశయించుటచేత.

భావము:

హిరణ్యాక్షుడు తన బలం విష్ణువు యొక్క అడ్డులేని శౌర్యం ముందు ఎందుకూ పనికిరాదన్న సంగతి మనస్సులో తెలిసికూడ దురభిమానంతో ఎదిరించాడు.