పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-683-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"గదఁ గేలఁబూని భుజర్వమెలర్పఁగ నన్ను సంగరా
ని నెదిరింతు; రార; యనివారణ దైత్యకులేశ్వరాధమా! "
వుడు వాఁడు నుబ్బి గద నంబుజనాభుని వ్రేసె; వ్రేసినన్
నుజవిభేది పట్టికొనెఁ దార్క్ష్యుఁ డహీంద్రునిఁ బట్టుకైవడిన్.

టీకా:

ఘన = పెద్ద; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = ధరించి; భుజ = బాహుబలము వలని; గర్వము = గర్వము; ఎలర్పగన్ = అతిశయించగా; నన్నున్ = నన్ను; సంగర = యుద్ధ; అవనిన్ = భూమి యందు; ఎదురింతు = ఎదుర్కొందువుగాని; రార = రార; అనివారణ = వారింపరాని విధముగ; దైత్య = రాక్షస; కుల = వంశ; ఈశ్వర = రాజులలో; అధమ = నీచుడా; అనవుడున్ = అనగా; వాడున్ = వాడు; ఉబ్బి = సంతోషించి; గదన్ = గదతో; అంబుజనాభుని = యజ్ఞవరాహుని {అంబుజనాభుడు - పద్మము నాభిన కలవాడు, విష్ణువు}; వ్రేసెన్ = కొట్టెను; వ్రేసినన్ = కొట్టగా; దనుజవిభేధి = యజ్ఞవరాహుడు {దనుజవిభేధి - దనుజ (రాక్షసుల)కు విభేధి (శత్రువు), విష్ణువు}; పట్టికొనె = పట్టుకొనెను; తార్క్ష్యుడు = గరుత్మంతుడు; అహి = సర్ప; ఇంద్రునిన్ = ప్రభువుని; పట్టుకొను = పట్టుకొనెడి; విధమునన్ = విధముగ.

భావము:

“రాక్షసరాజులలో నీచుడవు. పెద్ద గద పట్టుకొని మహాబలవంతుడ నని గర్వించి యుద్ధరంగంలో నన్నెదిరిస్తున్నావు. రారా!” అని పలుకగా హిరణ్యాక్షుడు చెలరేగి గదతో విష్ణువును కొట్టాడు. ఆయన ఆ గదను గరుత్మంతుడు పామును పట్టినట్లుగా ఒడిసిపట్టుకొన్నాడు.