పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-678-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులోద్ధర్త మనంబునం దలఁచె రక్షోరాడ్వధార్థంబుగా
దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభా శుక్రమున్
తోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రమున్ సంతతా
శ్రినిర్వక్రముఁ బాలితప్రకటధాత్రీచక్రముం జక్రమున్.

టీకా:

కుతలోద్ధర్త = ఆదివరాహుడు {కుతలోద్ధర్త - కుతలము (భూమి)ని ఉద్ధర్త (ఉద్దరించినవాడు), విష్ణువు}; మనంబునన్ = మనసులో; తలంచెన్ = అనుకొనెను; రక్షోరాట్ = రాక్షసరాజుని; వధ = సంహరించుట; అర్థంబునన్ = కొరకు; దితిసంతాన కులాటవీమహితసందీప్తప్రభాశుక్రమున్ = విష్ణుచక్రమును {దితి సంతాన కులాటవీ మహిత సందీప్త ప్రభా శుక్రము - దితి యొక్క సంతానము (పుత్రుల) కుల (సమూహము) అను అటవీ (అడవి)ని మహిత (గొప్ప) సందీప్త (బాగా వెలిగిపోయిన) ప్రభా (కాంతులు) కల శుక్రము (అగ్నిహోత్రము), విష్ణుచక్రము}; సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రమున్ = విష్ణుచక్రమును {సత తోద్య జ్జయశబ్ద సన్ముఖర భాస్వ చ్ఛక్రము - సంతత (ఎల్లప్పుడును) ఉద్యత్ (గట్టిగపలకబడు) జయ అను శబ్దముచేయు సత్ (మంచి) ముఖర (వాడియైన పళ్లు) కల భాస్వత్ (ప్రకాశించు) చక్రము, విష్ణుచక్రము}; సంతతాశ్రితనిర్వక్రమున్ = విష్ణుచక్రమును {సంత తాశ్రిత నిర్వక్రముఁ - సంతతా (ఎల్లప్పుడును) ఆశ్రిత (ఆశ్రయించినవారికి) నిర్వక్రము (అనుకూలమైనట్టిది), విష్ణుచక్రము}; పాలితప్రకటధాత్రీచక్రమున్ = విష్ణుచక్రమును {పాలిత ప్రకట ధాత్రీ చక్రము - పాలిత (పాలింపబడుతున్న) ప్రకట (ప్రసిద్దమైన) ధాత్రీచక్రము (భూమండలము) కలది, విష్ణుచక్రము}; చక్రమున్ = విష్ణుచక్రమును;

భావము:

భూమిని ఉద్ధరించిన విష్ణువు ఆ రాక్షసరాజును వధించడం కోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం దైత్యుల వంశమనే మహారణ్యాన్ని దహించే జాజ్వల్యమానమైన దావానలం. ఎల్లప్పుడు జయజయ శబ్దాలతో ప్రతిధ్వనించే దిక్చక్రం కలది. సర్వదా ఆశ్రయించేవారికి రక్షణ కలిగించేది. సమస్త భూమండలాన్ని పాలించేది.