పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-672-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సరసిజగఁర్భుడు ప
ల్కివచనము లర్థి విని నిలింపులు గుంపుల్
కొనిచూడ సస్మితానన
జముసెలువొంద నసురరు కభిముఖుఁడై.

టీకా:

అని = అని; సరసిజగర్భుడు = బ్రహ్మదేవుడు {సరసిజగర్భుడు - సరసిజము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; పల్కిన = పలికినట్టి; వచనముల్ = మాటలు; అర్థిన్ = కోరి; విని = విని; నిలింపులు = దేవతలు; గుంపుల్ = గుంపులు గుంపులుగా; కొని = కూడి; చూడన్ = చూస్తుండగా; స = కూడిన; స్మిత = చిరునవ్వు కలిగిన; ఆనన = వదనము అనెడి; వనజమున్ = పద్మము; చెలువొంద = ఒప్పుతుండగా; అసుర = రాక్షసులలో; వరున్ = శ్రేష్ఠుని; కున్ = కి; ఆభిముఖుండు = ఎదురుగ తిరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:

అని ఈ విధంగా పల్కిన బ్రహ్మ మాటలు విని విష్ణువు దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవిందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి...