పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు

  •  
  •  
  •  

3-671-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘా! యీ యభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే
యంబున్ మఱి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్
మాయాబలశాలి యైన దనుజున్ ఖండింపఁగా రాదు గా
వు నీవేళన త్రుంపు సజ్జనహితప్రోద్యోగరక్తుండవై."

టీకా:

అనఘా = ఆదివరాహ {అనఘుడు - పాపములు లేనివాడు, విష్ణువు}; ఈ = ఈ; అభిజిత్ = అభిజిత్తు {అభిజిత్ - సూర్యోదయమునుండి పద్నాలుగు (14) నుండి పదహారు గడియల కాలము}; ముహూర్తమునన్ = ముహూర్తములోనే; దేవారాతిన్ = రాక్షసుని {దేవారాతి - దేవతలకు ఆరాతి (శత్రువు), రాక్షసుడు}; మర్దంపవేని = సంహరింపకపొయినచో; అనయంబున్ = అవశ్యము; మఱి = మరల; దైత్య = రాక్షసుల యొక్క {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; వేళ = సమయము; అగున్ = అయిన; సంధ్యా = (సాయంకాల) సంధ్య; కాలము = సమయము; ఏతెంచినన్ = వచ్చేసినచో; ఘన = గొప్ప; మాయా = మాయలతొ కూడిన; బలశాలి = బలము కలవాడు; ఐన = అయిన; దనుజున్ = రాక్షసుని; ఖండింపగన్ = సంహరించుటకు; రాదు = వీలుకాదు; కావునన్ = అందుచేత; ఈ = ఈ; వేళన్ = సమయమందే; త్రుంపు = సంహరించు; సత్ = మంచి; జన = జనుల; హిత = మంచిని; ప్రా = గట్టి; ఉద్యోగ = సంకల్పమునందు; రక్తుండవు = ఆసక్తి కలవాడవు; ఐ = అయ్యి.

భావము:

పుణ్యాత్మా! ఈ అభిజిత్తు ముహూర్తంలోనే (మిట్ట మధ్యాహ్నమే) రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసులవేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాబలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీనిని చంపు.”