పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-663-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితేంద్రియుఁడై నిట్టూ
ర్పులు నిగడించుచును బొమలు ముడుపడ రోషా
కుమానసుఁడై గదఁగొని
జాక్షున కెదురు నడచె సాహసమొప్పన్.

టీకా:

చలిత = కంపించిన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; నిట్టూర్పులు = నిట్టూర్పులను; నిగడించుచును = పెద్దగా చేస్తూ; బొమలు = కనుబొమలు; ముడుపడన్ = ముడిపడగ; రోష = రోషముచేత; ఆకుల = చీకాకుపడిన; మానసుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; గదన్ = గదను; కొని = తీసుకొని; జలజాతాక్షున్ = ఆదివరాహుని {జలజాతాక్షుడు - జలజాతము (పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; కిన్ = కి; ఎదురు = ఎదురుగ; నడచెన్ = నడచెను; సాహసము = ధైర్యము; ఒప్పన్ = ఒప్పునట్లుగ.

భావము:

శరీరం కంపించగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ, కనుబొమలి ముడిపడగా, రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడై గదను తీసుకొని సాహసంతో విష్ణువునకు ఎదురు నడిచాడు.