పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-662-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిబ్భంగి సరోరుహాక్షుఁడు హిరణ్యాక్షున్ విడంబించి ప
ల్కి హాసోక్తుల కుల్కి రోషమదసంఘీభూతచేతస్కుఁ డై
నుఁ గ్రేవన్ మిడుఁగుర్లు సాలఁ బొడమంగాఁ గిన్కమైఁ దోఁకఁ ద్రొ
క్కి కృష్ణోరగరాజు మాడ్కి మదిలోఁ గీడ్పాటు వాటిల్లఁగన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; భంగిన్ = విధముగ; సరోరుహాక్షుండు = ఆదివరాహుడు {సరోరుహాక్షుడు - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుడిని; విడంబించి = హేళనచేసి; పల్కిన = పలికిన; హాస = ఎగతాళి; ఉక్తుల్ = మాటల; కున్ = కు; ఉల్కి = ఉలికిపడి; రోష = రోషమును; మద = గర్వమును; సంఘీభూత = కలసిపోయిన; చేతస్కుడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; కను = కంటి; గ్రేవన్ = చివరలనుండి; మిడుగుర్లు = నిప్పురవ్వలు; చాలన్ = ఎక్కువగ; పొడమన్ = కనుపించగా; కిన్క = కోపము; మై = తో; తోకన్ = తోకను; త్రొక్కిన = తొక్కిన; కృష్ణ = నల్లత్రాచు; ఉరగ = సర్ప; రాజు = రాజు; మాడ్కిన్ = వలె; మది = మనసు; లోన్ = లో; కీడ్పాటు = చికాకు; వాటిల్లగన్ = కలుగునట్లు.

భావము:

అని ఈవిధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని, రోషమూ గర్వమూ కలగలసిన మనస్సు కలవాడై, కనుగొనల్లో నిప్పుకణాలు వెలిగ్రక్కగా, తోక త్రొక్కిన నల్లత్రాచులాగా చీకాకు కలుగగా...