పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-661-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నిట సంస్థాపించెద
ని పలికితి వంతవాఁడవౌదువు నీకున్
నెరైన చుట్టములఁ బొడ
ని రా యిదె యముని పురికిఁ గాపుర మరుగన్."

టీకా:

ననున్ = నన్ను; ఇటన్ = ఇక్కడ; సంస్థాపించెదన్ = పాతివేసెదను; అని = అని; పలికిన = అంటివి; వాడవున్ = వాడివి; ఔదువు = అగున ఏమి; నీ = నీ; కున్ = కు; ఎవరైనన్ = ఎవరైనా; చుట్టములన్ = బంధువులను; పొడగొని = చూసి; రాన్ = రావాలని ఉంటే; ఇదె = ఇదే సమయము; యముని = యమధర్మరాజు యొక్క; పురి = నగరమునకు; కాపురమున్ = నివసించుటకు; అరుగన్ = వెళ్ళుటకు (సందర్భము).

భావము:

నన్నిక్కడ పూడ్చిపెడతా నన్నావు. అంతటివాడవే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్ళేముందు నీకు ఇష్టమైన చుట్టాలను చివరిసారిగా చూసుకొని రా.”