పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-660-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నెదురంగఁ జాలిన ఘనం బగు శౌర్యము ధైర్యమున్ బలం
బును గలవేని నిల్వు రణభూమిని నీ హితులైన వారికిం
నుఁగవ బాష్పపూరములు గ్రమ్మఁగ మాన్పఁగనోపుదేనిఁ జ
య్యనఁ జనఁబొమ్ము దానవకులాధమ! యూరక రజ్జులేటికిన్.

టీకా:

ననున్ = నన్ను; ఎదురంగన్ = ఎదిరింప; జాలిన = గలిగిన; ఘనంబున్ = గొప్పది; అగు = అయిన; శౌర్యమున్ = పరాక్రమమును; ధైర్యమున్ = ధైర్యమును; బలంబున్ = బలమును; కలవు = ఉన్నట్టు; ఏని = అయితే; నిల్వు = నిలబడు; రణ = యుద్ధ; భూమినిన్ = భూమి యందు; నీ = నీ యొక్క; హితులు = ఇష్టులు; ఐన = అయిన; వారికిన్ = వారికి; కను = కనుల; గవ = జంట; బాష్ప = కన్నీటి; పూరములున్ = మొత్తములు; క్రమ్మగన్ = కమ్ముకొనుటను; మాన్పగన్ = మానపించుటకు; ఓపుదేని = సమర్థుడవైతే; చయ్యనన్ = వెంటనే; చనబొమ్ము = వెళ్లిపో; దానవ = రాక్షస; కుల = వంశమునకు; అధమ = నీచుడా; ఊరక = ఉట్టినే; రజ్జులు = గొడవలు; ఏటికిన్ = ఎందులకు.

భావము:

రాక్షస కులాధమా! నన్ను ఎదిరించగల శౌర్యము, ధైర్యము, బలం నీకు ఉన్నట్లైతే యుద్ధభూమిలో నిలబడు. నీ ఆప్తులు కన్నీరు కార్చడాన్ని ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో. అనవసరమైన ప్రగల్భా లెందుకు?