పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-657-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను మదిగాక సంగరవివేకవిశారదు లైన యట్టి స
జ్జములు మృత్యుపాశములఁ జాల నిబద్ధులు నయ్యు నీ వలెన్
గొకొని యాత్మ సంస్తుతులకున్ ముదమందిరె యేల యీ విక
త్థములు బంటుపంతములె దైత్యకులాధమ! యెన్ని చూడగన్.

టీకా:

వినుము = వినుము; అది = అంతే; కాక = కాకుండగ; సంగర = యుద్ధవిద్యా; వివేక = జ్ఞానము; విశారదులు = బాగుగ తెలిసినవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; సత్ = మంచి; జనములు = వాళ్లు; మృత్యు = మరణ; పాశములన్ = పాశములచే; చాలన్ = మిక్కిలి; నిబద్ధులు = బాగకట్టబడినవారు; అయ్యు = అయినప్పటికిని; నీ = నీ; వలెన్ = వలెనే; గొనకొని = పూనుకొని; ఆత్మ = స్వ; సంస్తుతుల్ = ఉత్కర్షల; కున్ = కు; ముదము = ఇష్ట; అందిరె = పడిరా; ఏలన్ = ఎందులకు; ఈ = ఈ; వికత్థనములు = స్వోత్కర్షలు; బంటుపంతములె = శౌర్యవంతములా ఏమి; దైత్య = రాక్షస {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; కుల = వంశమునకు; అధమ = నీచుడా; ఎన్ని = ఎంచి; చూడగన్ = చూసినచో.

భావము:

ఓ రాక్షస కులాధమా! విను. రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్తుతులు? ఎంచి చూస్తే ఇవి పౌరుషవంతుని లక్షణాలా?