పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-656-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిమి గలదేని నాతోఁ
నను నెదిరించి పోరఁడఁగుము నీ కో
ర్కులు నేఁడు దీర్తు నూరక
పోయ వికత్థనంబు గదు దురాత్మా!

టీకా:

బలిమి = శక్తి; కలదు = ఉన్నట్టు; ఏని = అయితే; నా = నా; తోన్ = తోటి; కలనన్ = యుద్ధమున; ననున్ = నన్ను; ఎదిరించి = ఎదుర్కొని; పోరన్ = యుద్ధము చేయ; కడగుము = ప్రయత్నించుము; నీ = నీ యొక్క; కోర్కులు = కోరికలు; నేడు = ఈనాడు; తీర్తున్ = తీర్చెదను; ఊరకన్ = ఉత్తినే; తలపోయ = తలచుకొని; వికత్థనంబున్ = స్వోత్కర్షలు {వికత్థనము - తననుతాను పొగడుకొనుట, స్వోత్కర్ష}; తగదు = తగినపని కాదు; దురాత్మా = చెడ్డవాడ.

భావము:

ఓరీ దురాత్మా! నీకు శక్తి ఉన్నట్లైతే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధం కా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు.