పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-653-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గదఁ గేలఁబూని మణికాంచన నవ్య విచిత్రవర్మమిం
పొరగఁ దాల్చి దానవ నియుక్త దురుక్త నిశాతబాణముల్
ఘనమర్మముల్ కలఁప దానవహంత నితాంతశౌఁర్యుఁ డై
లుచు వచ్చు నద్దనుజుఁ న్గొని రోషవిభీషణాకృతిన్.

టీకా:

ఘన = పెద్ద; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = పట్టుకొని; మణి = మణులు; కాంచన = బంగారముల; నవ = కొత్త; విచిత్ర = విచిత్రమైన; వర్మము = కవచము; ఇంపు = చక్కదనము; ఒనరగన్ = ఒప్పునట్లు; తాల్చి = ధరించి; దానవ = రాక్షసునిచేత; నియుక్త = ప్రయోగింపబడిన; దురుక్త = చెడుమాటలు అను; నిశాత = వాడియైన; బాణముల్ = బాణములు; తన = తన యొక్క; ఘన = గొప్ప; మర్మముల్ = ప్రాణములను; కలపన్ = కలతపెట్టగ; దానవహంత = యజ్ఞవరాహము {దానవ హంత - దానవ (రాక్షసుల)ను హంత (సంహరించువాడు), విష్ణువు}; నితాంత = మిక్కిలి; శౌర్యుడు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి; కనలుచున్ = కోపముతో మండిపడుతూ; వచ్చు = వస్తున్న; ఆ = ఆ; దనుజున్ = రాక్షసుని; కన్గొని = చూసి; రోష = రోషముతో; విభీషణ = మిక్కిలి భయంకరమైన; ఆకృతిన్ = స్వరూపముతో.

భావము:

పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని, మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి, హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలత పెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడై వస్తున్న అతణ్ణి చూచి ఆగ్రహోదగ్రుడై....