పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-652-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున నయ్యజ్ఞవరాహమూర్తిధరుం డైన కమలలోచనుండు కనక కుండల గేయూర గ్రైవేయ గటకాంగుళీయక భూషణ రోచులు నింగిపర్వ సమరసన్నద్ధుం డై.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆ = ఆ; యజ్ఞవరాహ = యజ్ఞవరాహము యొక్క; మూర్తిన్ = స్వరూపమును; ధరుండు = ధరించినవాడు; ఐన = అయినట్టి; కమలలోచనుండు = హరి {కమల లోచనుడు - కమలములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కనక = బంగారపు; కుండల = కుండలములు; కేయూర = భుజకీర్తులు; గ్రైవేయ = హారములు; కటక = కంకణములు; అంగుళీయక = ఉంగరములు; భూషణ = ఆభరణములు యొక్క; రోచులు = కాంతులు; నింగిన్ = ఆకాశమున; పర్వన్ = పరచుకొనగ; సమర = యుద్ధమునకు; సన్నద్ధుండు = సిద్ధపడినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువు బంగారు మకరకుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశ మంతటా వ్యాపింపగా యుద్ధానికి సంసిద్ధుడై...