పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-648-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నింకు రోయక లజ్జం
జెంక వంచనను రణముసేసి జయంబుం
బొందెద నని తలఁచుచు నిటు
పంగతిం బాఱ బంటుపంతమె నీకున్."

టీకా:

నింద = అవమానముల; కున్ = కు; రోయక = అసహ్యించుకొనక; లజ్జన్ = సిగ్గు; చెందక = పడక; వంచనను = మోసముతో; రణము = యుద్ధము; చేసి = చేసి; జయంబున్ = జయమును; పొందెదను = పొందుతాను; అని = అని; తలచుచున్ = అనుకొనుచు; ఇటు = ఇలా; పంద = పిరికిపంద; గతిన్ = వలె; పాఱన్ = పారిపోవుట; బంటుపంతమె = మగతనమా ఏమి; నీకున్ = నీకు.

భావము:

“నిందలకు రోషం చెందక, సిగ్గుపడక, మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికిపందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా?