పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-647-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి వెనుక దగులు నక్రము
ణిం జని దైత్యవిభుఁడు దిసి యిటులనున్
దురిత పయోనిధి తరికిన్
గిరికిన్ ఖురదళిత మేరుగిరికిన్ హరికిన్.

టీకా:

కరి = ఏనుగు; వెనుకన్ = వెంట; తగులు = పడు; నక్రము = మొసలి; కరణిన్ = వలె; చని = వెళ్లి; దైత్య = రాక్షస {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; విభుడున్ = రాజు; కదిసి = సమీపించి; ఇటుల = ఈవిధముగన్; అనున్ = పలికెను; దురితపయోనిధితరి = ఆదివరాహుని {దురిత పయోనిధి తరుడు - దురితములు (పాపములు) అను పయోనిధి (సముద్రము)ని తరుడు (దాటించువాడు), విష్ణువు}; కిన్ = కి; కిరి = ఆదివరాహుని {కిరి - అడవి పంది}; కిన్ = కి; ఖురదళితమేరుగిరి = ఆదివరాహుని {ఖుర దళిత మేరుగిరి - ఖురము (గిట్టలతో) దళిత (అణచబడిన) మేరుగిరి కలవాడు, ఆదివరాహమూర్తి}; కిన్ = కి; హరి = ఆదివరాహుని {హరి - పాపములను హరించువాడు, విష్ణువు}; కిన్ = కి.

భావము:

ఏనుగు వెంటబడిన మొసలి వలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి, పాపసముద్రాన్ని దాటించేవాడూ, వరాహరూపాన్ని ధరించినవాడూ, గిట్టలతో మేరుపర్వతాన్ని మట్టగించినవాడూ అయిన హరితో ఇలా అన్నాడు.