పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-645-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సురిపు వాక్యాంకుశముల
గురు కుపితస్వాంతు డగుచుఁ గొమరారె వసుం
తోడ భీతినొందిన
ణిం గల కరికులేంద్రు రణిం బెలుచన్.

టీకా:

సురరిపు = రాక్షసుని {సుర రిపుడు - సుర (దేవత)లకు రిపుడు (శత్రువు), రాక్షసుడు}; వాక్య = మాటలు అను; అంకుశములన్ = అంకుశములచే {అంకుశము - ఏనుగును నడపుటకు వాడు ఆయుధము}; గురు = మిక్కిలి; కుపిత = కోపించిన; స్వాంతుడు = మనసుకలవాడు; అగుచున్ = అవుతూ; కొమరారెన్ = అందగించెను; వసుంధర = భూదేవి; తోడన్ = తో; భీతిన్ = భయమును; పొందిన = పొందినట్టి; కరణిన్ = ఆడు ఏనుగును; కల = (కూడ) ఉన్న; కరి = ఏనుగులు; కుల = సమూహమునకు; ఇంద్రుడు = నాయకుడు; కరణిన్ = వలె; పెలుచన్ = అతిశయించి.

భావము:

ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడయేనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవితో కూడి అతిశయించాడు.