పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-644-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరళ యోగమాయాబలంబునఁ జేసి-
ల్ప పౌరుషమున లరు నిన్ను
ర్థి సంస్థాపించి స్మత్సుహృద్భృత్య-
కులుల కెల్లను మోద మొలయఁ జేయఁ
జెలువేది మద్గదాశీర్ణుఁడ వగు నిన్నుఁ-
నుఁగొని దేవతాణము లెల్ల
నిర్మూలు లై చాల నెఱి నశించెద రన్న"-
విని యజ్ఞపోత్రియై వెలయుచున్న

3-644.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి సరోజాత భవ ముఖారుల కెల్ల
చ్చు దురవస్థ కాత్మలో వంత నొంది
నిశిత దంష్ట్తాగ్రలసితమై నెగడు ధరణి
దేవితో నొప్పె నా వాసుదేవుఁ డంత.

టీకా:

అవిరళ = గట్టి, దట్టమైన; యోగమాయా = యోగమాయయొక్క; బలంబునన్ = బలము; చేసి = వలన; అల్ప = అల్పమైన; పౌరుషమునన్ = శౌర్యముతో; అలరు = ప్రకాశించు; నిన్నున్ = నిన్ను; అర్థిన్ = కోరి; సంస్థాపించి = పాతిపెట్టేసి; అస్మత్ = నా యొక్క; సుహృత్ = స్నేహితులును; భృత్యు = సేవకులుల; కులులు = గుంపులు; కున్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; మోదము = సంతోషము; ఒలయన్ = కలుగునట్లు; చేయన్ = చేయగా; చెలువు = చక్కదనమును; ఏది = నశింపజేసి; మత్ = నా యొక్క; గదా = గదచేత; శీర్ణుడవు = చూర్ణమైనవాడవు; అగు = అయ్యే; నిన్నున్ = నిన్ను; కనుగొని = చూసి; దేవతా = దేవతల; గణములు = సమూహములు; ఎల్లన్ = సమస్తమును; నిర్మూలులు = మొదలుతెగినవారు; ఐ = అయ్యి; చాలన్ = పెక్కు; నెఱిన్ = విధముల; నశించెదరు = నాశనమగుదురు; అన్నన్ = అనగా; విని = విని; యజ్ఞపోత్రి = యజ్ఞవరాహము; ఐ = అయ్యి; వెలయుచున్న = విలసిల్లుతున్నట్టి;
హరి = విష్ణువు; సరోజాతభవ = బ్రహ్మదేవుడు {సరోజాతభవుడు - సరోజాతము (పద్మము)న భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; ముఖ = మొదలగు; అమరుల్ = దేవతల; కున్ = కి; ఎల్లన్ = అందరకు; వచ్చు = వచ్చెడి; దురవస్థ = కష్టముల; కున్ = కి; ఆత్మ = మనసు; లోన్ = లోపల; వంతన్ = దిగులు; పొంది = పొంది; నిశిత = వాడియైన; దంష్ట్రా = కోరల; అగ్ర = చివర; లసితము = ప్రకాశించునది; ఐ = అయ్యి; నెగడు = మెరయుచున్న; ధరణిదేవి = భూదేవి; తోన్ = తోటి; ఒప్పెన్ = చక్కగానుండెను; ఆ = ఆ; వాసుదేవుడు = హరి {వాసుదేవుడు - ఆత్మలందు వసించుదేవుడు, విష్ణువు}; అంతన్ = అంతట.

భావము:

గొప్ప యోగమాయ యొక్క బలంచేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి, నా మిత్రులకు, సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు” అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి....శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతల కందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూదేవితో స్థిరంగా ఉన్నాడు.