పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-643-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాయావి వగుచు నిప్పుడు
వాక యీ పుడమిఁ జోరభావంబున నీ
వీ యెడఁ గొని పోజూతునె
యాతభుజబలముచేత డపక? యనుచున్.

టీకా:

మాయావివి = మాయగాడివి; అగుచున్ = అవుతూ; ఇప్పుడు = ఇప్పుడు; పాయక = వదలక; ఈ = ఈ; పుడమిన్ = భూమిని; చోర = దొంగ; భావంబునన్ = బుద్ధితో; నీవు = నీవు; ఈ = ఈ; ఎడన్ = విధముగ; కొని = తీసుకొన; పోజూతునె = పోతుంటే చూస్తూ ఉంటానా?; ఆయాత = విస్తారమైన; భుజ = బాహు; బలమునన్ = బలము; చేతన్ = చే; నడపక = అణచకుండ; అనుచున్ = అంటూ.

భావము:

మాయగాడివై ఇప్పుడీ భూమిని దొంగతనంగా తీసికొని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా?