పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-640-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యాశ్చర్య భయంబులు
మనమునఁ దొంగిలింపఁ నుజాధిపుఁ డి
ట్లనియెన్ భీకరసూకర
నువొంది చరించు దనుజ ర్పావహుతోన్

టీకా:

అని = అని; ఆశ్చర్య = ఆశ్చర్యము; భయంబులున్ = భయములు; తన = తన యొక్క; మనంబునన్ = మనసుని; దొంగిలింపన్ = దోచుకోగా; దనుజ = రాక్షస; అధిపుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; భీకర = భయంకరమైన; సూకర = వరాహ; తనువున్ = దేహమును; పొంది = ధరించి; చరించు = తిరుగుతున్న; దనుజదర్పావహు = విష్ణుమూర్తి {దనుజదర్పావహుడు - దనుజ (రాక్షసు)ల దర్పము (గర్వము) ను అపహరించువాడు, హరి}; తోన్ = తోటి.

భావము:

అని ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వ నాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు