పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-635-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ రుచిసన్నిభము లగు
లోచనయుగళ దీప్తి నరఁ దదాలో
ముల దనుజాధీశుని
నుకాంతి హరింపఁజేసెఁ త్క్షణమాత్రన్.

టీకా:

వనజ = పద్మము {వనజము - వనము (నీటి) అందు పుట్టినది, పద్మము}; రుచి = ప్రకాశమునకు; సన్నిభములు = సమానములు; అగు = అయినట్టి; తన = తన యొక్క; లోచన = కన్నుల; యుగళ = జంట; దీప్తిన్ = కాంతి; తనరన్ = విజృంభించగ; తత్ = వాని; ఆలోకనములన్ = చూపులచే; దనుజ = రాక్షస; అధీశునిన్ = ప్రభువు యొక్క; తను = దేహము యొక్క; కాంతిన్ = ప్రకాశమును; హరింపన్ = అణగునట్టు; చేసెన్ = చేసెను; తత్ = ఆ; క్షణ = క్షణము; మాత్రన్ = సమయములోనే.

భావము:

కమలములవంటి తన కన్నుల కాంతులను ప్రసరింప జేస్తూ, తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేశాడు.