పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : వరహావతారుని ఎదిరించుట

  •  
  •  
  •  

3-633-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజారి యెదురఁ దగఁ గనె
విరళ దంష్ట్రాభిరాము మరలలాముం
గులయభరణోద్ధామున్
నమయస్తబ్ధరోము లదశ్యామున్.

టీకా:

దివిజారి = రాక్షసుడు {దివిజారి - దివిజుల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు}; ఎదురన్ = ఎదురుగ; తగన్ = శ్రీఘ్రమే; కనెన్ = చూసెను; నవిరళదంష్ట్రాభిరామున్ = ఆదివరాహుని {నవిరళ దం ష్ట్రాభిరాముడు - అవిరళ (దట్టమైన) దంష్ట్తా (కోరలతో) అభిరాముడు (ఒప్పువాడు), ఆదివరాహావతారుడు}; అమరలలామున్ = ఆదివరాహుని {అమర లలాముడు - అమరుల (దేవతల)కు లలాముడు శ్రేష్ఠమైనవాడు, విష్ణువు}; కువలయభరణోద్ధామున్ = ఆదివరాహుని {కువలయ భర ణోద్ధాముడు - కువలయము (భూమి)ని భరణ (మోయుట) అందు ఉద్దాముడు (అధికుడు), విష్ణువు}; సవనమయస్తబ్దరోమున్ = ఆదివరాహుని {సవన మయ స్తబ్ధ రోముడు - సవన (యజ్ఞ) మయ స్తబ్ధ రోముడు (నిక్కబొడుచుకున్న వెండ్రుకలు గలవాడు ,  వరాహుడు), విష్ణువు}; జలదశ్యామున్ = ఆదివరాహుని {జలద శ్యాముడు - జలదము (మేఘము) వలె శ్యాముడు (నల్లగ ఉన్నవాడు), విష్ణువు}.

భావము:

హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైన కోరలు కలిగి, దేవతలలో శ్రేష్ఠుడై, భూభారాన్ని మోయడానికి సమర్థుడై, యజ్ఞమయమై, మేఘంలాగా నల్లగా ఉన్న ఆది వరాహమూర్తిని వీక్షించాడు.