పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్షుని దిగ్విజయము

  •  
  •  
  •  

3-628-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నవసరమున నారద
మునివరుఁ డెదు రేఁగుదెంచి ముదము దలిర్పన్
"దనుజేంద్ర! యెందుఁ బోయెద"
ని యడిగిన నారదునకు తఁ డిట్లనియెన్.

టీకా:

చను = వెళ్ళు; అవసరంబున = సమయమున; నారద = నారదుడు అను; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; ముదము = సంతోషము; తలిర్పన్ = ఉప్పొంగగా; దనుజ = రాక్షసులలో; ఇంద్ర = శ్రేష్ఠుడ; యెందున్ = ఎక్కడకు; పోయెదవు = వెళ్ళుతుంటివి; అని = అని; అడిగినన్ = అడుగగా; నారదున్ = నారదున; కున్ = కు; అతడు = అతడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి “ఓ రాక్షసరాజా! ఎక్కడికి వెళ్తున్నావు?” అని అడిగిన నారదునితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు.