పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్షుని దిగ్విజయము

  •  
  •  
  •  

3-625-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషాకృతిఁ బ్రతియుగమునఁ
బురుషోత్తముఁ డవతరించి భూరిభుజా వి
స్ఫుణన్ దుష్టనిశాటుల
రియించుచు నుండు మునిగణార్చితపదుఁడై.

టీకా:

పురుష = పురుషుని; ఆకృతిన్ = రూపముతో; ప్రతి = ప్రతి ఒక్క; యుగమునన్ = యుగములోను; పురుషోత్తముడున్ = విష్ణుమూర్తి {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, హరి}; అవతరించి = అవతరించి; భూరి = అతి మిక్కిలి; భుజా = బాహుబల; విస్ఫురణన్ = అతిశయమున; దుష్ట = చెడ్డ; నిశాటుల = రాక్షసులను {నిశాటులు - నిశ (రాత్రి) అందు చరించువారు, రాక్షసులు}; హరియించుచున్ = సంహరిస్తూ; ఉండున్ = ఉండును; ముని = మునుల; గణా = సమూహములచే; అర్చిత = అర్చింపబడిన; పదుడు = పాదములు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

పురుషోత్తముడూ, మునులు పూజించే పాదపద్మాలు గలవాడూ అయిన విష్ణువు ప్రతియుగంలోనూ పురుషరూపంతో భూమిమీద అవతరించి పరాక్రమవంతులూ దుష్టులూ ఐన రాక్షసులను సంహరిస్తాడు.