పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్షుని దిగ్విజయము

  •  
  •  
  •  

3-622-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గొకొని యమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నున్నవాడు దా
నిమొనఁ బెక్కుమాఱు లభియాతుల నోలి జయించి శక్తి పెం
పు సడిసన్నవీరు డని భూజనకోటి నుతించు నందు వే
ను మత డిచ్చు నీకు నని ర్వము దీఱెడు నంతమీదఁటన్.

టీకా:

గొనకొని = పూని; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; వికుంఠ = వైకుంఠము అను; పురంబునన్ = పురములో; ఉన్నవాడు = ఉన్నాడు; తాన్ = అతను; అని = యుద్ధ; మొనన్ = రంగములో; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; అభియాతులన్ = శత్రువులను; ఓలిన్ = క్రమముగ; జయించి = జయించి; శక్తిన్ = బలము యొక్క; పెంపునన్ = అతిశయమున; సడిసన్న = ప్రసిద్ధికెక్కిన; వీరుడు = శూరుడు; అని = అని; భూ = భూమి మీది; జన = జనులు; కోటి = అందరును; నుతించున్ = స్తుతింతురు; అందున్ = అక్కడకు; వేచనుము = శ్రీఘ్రముగ పొమ్ము; అతడు = అతడు; ఇచ్చు = ఇచ్చును; నీకున్ = నీకు; అనిన్ = యుద్ధమును; సర్వమున్ = అంతయు; తీఱెడున్ = తీరిపోతాయి; అంతమీద = ఆతరువాత.

భావము:

ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధరంగంలో శత్రువులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరుమోసిన వీరుడని భూజనులంతా పొగడుతారు. వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు. అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు.