పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్షుని దిగ్విజయము

  •  
  •  
  •  

3-613-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శౌర్యము వోవఁదట్టి నిజసాధనముల్ దిగనాడి విక్రమౌ
దార్యపరాక్రమక్రమము ప్పఁగ భీతిలి పాఱి రక్కటా
కార్యముఁ దప్పి నాకులని గైకొని యార్చి సుమేరుపర్వత
స్థైర్యుఁడు వార్థిఁ జొచ్చె నతి ర్పిత భూరి భుజావిజృంభియై.

టీకా:

శౌర్యమున్ = పౌరుషమును; పోవదట్టి = పోగొట్టుకొని; నిజ = తమ; సాధనములన్ = ఆయుధములను; దిగనాడి = విడిచిపెట్టి; విక్రమ = శౌర్యము; ఔదార్య = ఉదారబుద్ధి; పరాక్రమక్రమము = శత్రువులను జయించు సామర్థ్యములు; తప్పగన్ = తొలగిపోగా; భీతిలి = భయపడిపోయి; పాఱిరి = పారిపోయిరి; అక్కటా = అయ్యో; కార్యమున్ = వివాదమును; తప్పిన్ = పోగొట్టుకొనిన; నాకులు = దేవతలు; అని = అని; కైకొని = పూనుకొని; ఆర్చి = అరచి; సుమేరు = సుమేరు అను; పర్వత = పర్వతమంత; స్థైర్యుడు = స్థైర్యము కలవాడు; వార్థిన్ = సముద్రమును; చొచ్చెన్ = చొరబడెను; అతి = మిక్కిలి; దర్పిత = గర్వించిన; భూరి = బహుమిక్కిలి; భుజా = బాహుబలము; విజృంభి = అతిశయించినవాడు; ఐ = అయ్యి.

భావము:

“పౌరుషం పోగొట్టుకొని, తమ ఆయుధాలను విడిచిపెట్టి దేవతలు భయపడి కర్తవ్యాన్ని విస్మరించి పారిపోయారు కదా” అని సింహగర్జన చేసి మేరుపర్వతం వంటి స్థైర్యం కలిగిన హిరణ్యాక్షుడు గొప్ప భుజబలంతో, విజృంభించిన గర్వాతిశయంతో సముద్రంలో ప్రవేశించాడు.