పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-600-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వనజాసనుఁ డాడిన
విని తద్వృత్తాంత మెఱిఁగి విబుధులు నాకం
బు కేఁగిరి దితి నిజనా
థుని మాటలు దలఁచి యపరితోషముతోడన్.

టీకా:

అని = అని; వనజాసనుడు = బ్రహ్మదేవుడు {వనజాసనుడు - వనజము (పద్మము) న ఆసనుడు (ఆసీనుడై ఉన్నవాడు), బ్రహ్మదేవుడు}; ఆడిన = పలుకగా; విని = విన్నవారై; తత్ = ఆ; వృత్తాంతము = విషయము; ఎఱిగి = తెలిసి; విబుధుల్ = దేవతలు; నాకంబున్ = స్వర్గమున; కున్ = కు; ఏగిరి = వెళ్లిరి; దితి = దితి; నిజ = తన; నాధుని = భర్త యొక్క; మాటలు = మాటలు; తలచి = తలచుకొని; అపరితోషము = అసంతుష్టి; తోడన్ = తోటి.

భావము:

అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకొని స్వర్గలోకానికి వెళ్ళి పోయారు. దితి తన భర్త మాటలను తలచుకొని అసంతృప్తి చెందింది.