పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-599-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంకు మూల మా హరి రమేశ్వరుఁ డర్థి నొనర్చు కార్యముల్
వింలె సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుఁ డా
ద్యం వికార శూన్యుఁడు దయానిధి మీ యెడ మేలుసేయు నీ
చిం దొఱంగి వేచనుఁడు చేకుఱు మీకు మనోరథార్థముల్."

టీకా:

ఇంతకున్ = దీనికంతకు; మూలము = మూలకారణము; ఆ = ఆ; హరి = విష్ణుమూర్తి; రమేశ్వరుడు = విష్ణుమూర్తి {రమేశ్వరుడు - రమ (లక్ష్మీదేవి) యొక్క ఈశ్వరుడు (భర్త), విష్ణువు}; అర్థిన్ = కోరి; ఒనర్చు = చేయు; కార్యముల్ = పనులు; వింతలె = వింతలా ఏమి; సర్వభూతభవవృద్ధివినాశనహేతుభూతుఁడు = విష్ణుమూర్తి {సర్వ భూత భవ వృద్ధి వినాశన హేతుభూతుఁడు - సర్వమైన భూతముల యొక్క భవ (సృష్టి) వృద్ధి ( స్థితి) నాశన (లయము) లకు మూలకారణమైనవాడు, విష్ణువు}; ఆద్యంతవికారశూన్యుఁడు = విష్ణుమూర్తి {ఆద్యంత వికార శూన్యుఁడు - అది (మొదలు) కాని అంతము (నాశనము) కాని వికార (మార్పులు) కాని శూన్యుడు (లేనివాడు), విష్ణువు}; దయానిధి = విష్ణుమూర్తి {దయానిధి - కృపకు సముద్రము వంటివాడు, విష్ణువు}; మీ = మీ; ఎడన్ = అందు; మేలు = మంచి; చేయున్ = చేయును; ఈ = ఈ; చింత = దుఃఖమును; తొఱంగి = విడిచి; వేచనుడు = వేగముగా వెళ్లండి; చేకూఱు = సమకూరును; మీకు = మీకు; మనో = మనసున; రథ = తిరుగుతున్న; అర్థముల్ = కోరికలు.

భావము:

దీని కంతా ప్రధానకారణం ఆ హరి. ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాసుల వృద్ధిక్షయాలకు కారణమైనవాడూ, ఆది అంతం అనే వికారాలు లేనివాడూ, దయకు నిలయమైనవాడూ అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదలిపెట్టి వెళ్ళండి. మీ కోరికలు తీరుతాయి.”