పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-597-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని తేజో హానిగ జయ
వియులు ధరఁ గూలి రపుడు విహ్వలు లగుచుం
ద్రిగముల సురవిమాన
వ్రముల హాహారవంబు గ్రందుగఁ జెలగన్.

టీకా:

నిజ = తమ; తేజస్ = తేజస్సునకు; హానిగన్ = నష్టము కాగా; జయవిజయులు = జయవిజయులు; ధరన్ = భూమిపైన; కూలిరి = పడిరి; అప్పుడు = అప్పుడు; విహ్వలులు = మిక్కిలి భయము కలవారు; అగుచున్ = అవుతూ; త్రి = మూడు; జగముల = లోకములలోని; సుర = దేవతల; విమాన = విమానము లందలి; వ్రజముల = సమూహములలోను; హాహా = హాహా అనెడి; రవంబున్ = స్వరములు; క్రందుగ = గట్టిగా; చెలగన్ = చెలరేగగా.

భావము:

జయవిజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేల కూలారు. ముల్లోకాలలోను, దేవతా విమానాలలోను హాహాకారాలు చెలరేగాయి.