పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-592-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంత్రితులై తగ నిజ
ధాములకుఁ జనిరి వారు డయక లక్ష్మీ
కాముడు జయవిజయుల నభి
రామంబుగఁ జూచి పలికె య మొప్పారన్.

టీకా:

ఆమంత్రితులు = అనుజ్ఞ పొందినవారు; ఐ = అయ్యి; తగన్ = చక్కగా; నిజ = తమ; ధామముల్ = నివాసములు; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; వారు = వారు; తడయక = ఆలస్యము చేయకుండగ; లక్ష్మీకాముడు = విష్ణుమూర్తి {లక్ష్మీ కాముడు - లక్ష్మీదేవిచే కాముడు (కోరబడువాడు), విష్ణువు}; జయవిజయులన్ = జయవిజయులని; అభిరామంబుగ = అభిమానముగా; చూచి = చూసి; పలికెన్ = పలికెను; రయము = వేగము; ఒప్పారన్ = ఒప్పునట్లు.

భావము:

అనుజ్ఞ పొందినవారై ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్ళారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు.