పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-591-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పలికిన భాషణములు
లోదరు భాషణములుగా దలఁచుచు నె
య్యమునన్ వైష్ణవలక్ష్మిం
బ్రదంబునఁ బ్రస్తుతించి రమేశ్వరుచేన్.

టీకా:

తమ = తాము; పలికిన = పలికినట్టి; భాషణములు = మాటలు; కమలోదరు = నారాయణుని {కమలోదరుడు - కమలము ఉదరము (పొట్ట)న కలవాడు, విష్ణువు}; భాషణములు = మాటలు; కాన్ = అగుటను; తలచుచు = అనుకొనుచు; నెయ్యమునన్ = స్నేహపూర్వకముగ; వైష్ణవ = విష్ణుదేవుని; లక్ష్మిన్ = ఐశ్వర్యమును; ప్రమదంబునన్ = సంతోషముతో; ప్రస్తుతించి = చక్కగా కీర్తించి; పరమేశ్వరు = భగవంతుని {పరమేశ్వరుడు - పరమ (అత్యుత్తమ) ఈశ్వరుడు (ఫ్రభువు), విష్ణువు}; చేన్ = చేత.

భావము:

తాము మాట్లాడిన మాటలను విష్ణువు మాటలుగా భావిస్తూ స్నేహభావంతో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని స్తుతించి, ఆ శ్రీహరిచేత....