పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-586-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను వైరంబున నైనను
మునఁ దలఁచుటను నా సక్షమున మదా
మీక్షించుచు నీల్గుట
ఘాత్మకులై వసింతు స్మత్పదవిన్.

టీకా:

ననున్ = నన్ను; వైరంబునన్ = శత్రుత్వముతో; ఐనను = అయినప్పటికిని; మనమునన్ = మనసులో; తలచుటను = భావించుటవలననూ; నా = నా యొక్క; సమక్షమునన్ = కంటికెదురుగా; మత్ = నా యొక్క; ఆననమున్ = మోమును; ఈక్షించుచున్ = చూస్తూ; నీల్గుటన్ = మరణించుటచేతను; అనఘాత్ములు = పుణ్యాత్ములు; ఐ = అయ్యి; వసింతురు = ఉండెదరు; అస్మత్ = నా యొక్క; పదవిన్ = స్థితియందు (సాయుజ్యమున ఉందురు).

భావము:

నన్ను విరోధంచేతనైనా తమ మనస్సులలో భావించడంవల్లనూ, నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లనూ వీళ్ళు పుణ్యాత్ములై నా ఆస్థానంలో నివసిస్తారు.