పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-581-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయిన మాకుం బ్రియం బగుం గావున ననపరాధులు నతి నిర్మలాంతఃకరణులు నైన వీరలకు ననృతంబులు పలికితి మేని మమ్మయినం జిత్తంబు కొలది నాజ్ఞాపింపు" మని కరకమలంబులు మొగిచి కృతాంజలులై యున్న మునులం గరుణార్ద్ర దృష్టిం గనుంగొని.

టీకా:

అట్లు = ఆవిధముగ; అయినన్ = అయినా; మాకున్ = మాకు; ప్రియంబున్ = ఇష్టమే; అగున్ = అవును; కావున = అందుచేత; అనపరాధులన్ = తప్పుచేయనివారిని; అతి = మిక్కిలి; నిర్మల = స్వచ్ఛమైన; అంతఃకరణులు = మనసులు కలవారు; ఐనన్ = అయిన; వీరల = వీరి; కున్ = కి; అనృతంబులున్ = అసత్యములు; పలికితిమి = పలికినట్టి వారము; ఏనిన్ = అయినచో; మమ్మున్ = మమ్మలను; అయినన్ = అయినాసరే; చిత్తంబు = తోచిన; కొలది = అంత; ఆజ్ఞాపింపుము = దండించుము; అని = అని; కర = చేతులు అను; కమలంబులున్ = పద్మములను; మొగిచి = జోడించి; కృత = చేసిన; అంజలులు = అంజలిఘటించినవారు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; మునులన్ = మునులను; కరుణా = దయచేత; ఆర్థ్ర = తడియైన; దృష్టిన్ = చూపులతో; కనుంగొని = చూసి.

భావము:

నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులూ, నిష్కల్మష హృదయులూ ఐన ఈ జయవిజయులను మేము అనరాని మాటలు అని ఉంటే మమ్మల్నయినా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు” అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి...