పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-580-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిగి యేము శపించితి మంతకంటె
బెడిద మగు నాజ్ఞసేయ నభీష్టమేని
జేయు మదికాక సమధికశ్రీ దనర్పఁ
జేసి రక్షించెదేని రక్షింపు మీశ!

టీకా:

అలిగి = కోపించి; ఏము = మేము; శపించితిమి = శాపము ఇచ్చితిమి; అంతకంటె = అంతకుమించి; బెడిదము = కఠినము; అగు = అయిన; ఆజ్ఞన్ = దండనమును; చేయన్ = చేయవలెనని; అభీష్టము = అభిప్రాయము; ఏనిన్ = కలిగిన; చేయుము = (అటులనే) చేయుము; అది = అది; కాక = కానిచో; సమధిక = మిక్కిలి; శ్రీన్ = సంపదను; తనర్పన్ = అతిశయించునట్లు; చేసి = చేసి; రక్షించెద = కాపాడెదవు; ఏనిన్ = అయినచో; రక్షింపుము = కాపాడుము; ఈశ = భగవంతుడా {ఈశ - ఈశ్వరుడు, విష్ణువు}.

భావము:

మేము వీరిని శపించాము. దేవా! అంతకంటె కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలాకాక అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే రక్షించు.