పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-579-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునుల మగు మమ్ము నతి మోదమునను నీవు
త్కరించుట లెల్ల సజ్జన పరిగ్ర
హార్థమై యుండుఁ గాదె మహాత్మ! యొకటి
విన్నవించెద మీ జయవిజయులకును.

టీకా:

మునలము = మునులు అయినవారము; అగు = అయిన; మమ్మున్ = మమ్ములను; అతి = మిక్కిలి; మోదముననున్ = సంతోషకరముగ; నీవు = నీవు; సత్కరించుట = గౌరవించుట; ఎల్లన్ = అంతయు; సజ్జన = మంచివారిని; పరిగ్రహమున్ = అనుగ్రహించు; అర్థము = కొరకు; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; కాదే = కదా; మహాత్మా = మహాత్ముడా, హరి {మహాత్ముడు - గొప్ప ఆత్మ కలవాడు, విష్ణువు}; ఒకటి = ఒక విషయము; విన్నవించెదము = మనవిచేసెదము; ఈ = ఈ; జయవిజయుల్ = జయవిజయులు {జయవిజయులు - వైకుంఠధాముని ద్వారపాలకులు}; కున్ = కి.

భావము:

మహానుభావా! మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించడం సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం. ఈ జయ విజయులపై....