పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-578-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విశ్వమున కెల్లఁ గర్తవు విశ్వనిధివి
విశ్వసంరక్షకుండ వై వెలయు నీకుఁ
డగిఁ బ్రాభవహాని యెక్కడిది దలఁప
వినయములు నీకు లీలలై వెలయుఁ గాన.

టీకా:

విశ్వమున్ = లోకముల; కున్ = కి; ఎల్లన్ = సమస్తమునకు; కర్తవు = సృష్టించినవాడవు; విశ్వ = విశ్వమునకు; నిధివిన్ = నివాసమైనవాడవు; విశ్వ = విశ్వమునకు; సంరక్షకుడవు = చక్కగా కాపాడేవాడవు; ఐ = అయ్యి; వెలయు = విలసిల్లు; నీకున్ = నీకు; కడగి = ప్రయత్నించి; ప్రాభవ = గొప్పదనమునకు; హాని = నష్టము; ఎక్కడిది = ఎక్కడుంది; తలంపన్ = తరచిచూసిన; వినయములు = వినయపూర్వక విధానములు; నీకున్ = నీకు; లీలలు = లీలలు; ఐ = అయ్యి; వెలయున్ = విలసిల్లును; కాన = కాని.

భావము:

విశ్వానికి కర్తవూ, విశ్వమూర్తివీ, విశ్వరక్షకుడవూ అయి విరాజిల్లే నీకు గౌరవహాని ఎక్కడిది? ఈ వినయాలు నీ లీలావిలాసాలు కదా!