పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-577-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయినఁ బరుల యెడ వినయంబులు వలికిన బ్రాభవహాని యగు నని తలంచితివేని.

టీకా:

అట్లు = ఆవిధముగ; అయినన్ = అయితే; పరుల = ఇతరుల; ఎడ = విషయములో; వినయంబులున్ = వినయ పూర్వక వచనములు; పలికిన = పలికితే; ప్రాభవ = గొప్పదనమునకు; హాని = నష్టము; అగును = వాటిల్లును; అని = అని; తలంచితివి = అనుకొంటివి; ఏనిన్ = అయినప్పటికిని.

భావము:

ఆ విధంగా ఇతరులపట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లైతే...