పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-573.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మలనయన! కృపావలోనము లొలయ
ర్థిఁ బొడసూపు భాగవతానురక్తిఁ
జేసి భవదీయ మహిమంబు చిత్ర మరయ
చిరశుభాకార! యిందిరాచిత్తచోర!

టీకా:

సతతంబున్ = ఎల్లప్పుడును; అర్థ = కోరికలు; అర్థి = కోరునట్టి; జన = జనుల యొక్క; శిరస్ = శిరములకు; అలంకార = అలంకారములు అయిన; పద = పాదముల; రేణువులు = భూళి; కల = కలిగిన; పద్మ = లక్ష్మీదేవి; నేడు = ఈ దినము; జలజ = పద్మము {జలజము - జలమున పుట్టునది, పద్మము}; కింజల్క = కేసరములందు; నిష్యందమాన = చిందుతున్న; మరంద = తేనెలకై; లోభా = ఆశపడి; ఆగత = వచ్చిన; భ్రమర = తుమ్మెదల; నాయకుని = పురుషుని; పగిది = వలె; ధన్య = జన్మసార్థక్యతనుపొందిన; జన = జనులచే; అర్పిత = సమర్పింపబడి; ఉదంచిత = చక్కగా గౌరవింపబడిన; తులసికా = తులసీ; దామంబున్ = దండ; కున్ = కు; నిజ = స్వంత; ధామము = నివాసము; అగుచున్ = అవుతూ; భాసిల్లు = విరాజిల్లు; భవదీయ = నీ యొక్క; పాద = పాదములు అనెడు; అరవిందముల్ = పద్మములు; విలసిత = ప్రకాశించు; భక్తి = భక్తితో; సేవించుచున్ = సేవిస్తూ; ఉండి = ఉండి;
కమలనయన = హరి {కమలనయనుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కృపా = దయ కల; అవలోకనములన్ = చూపులు; ఒలయన్ = చేరుటవలన, పడుటవలన; అర్థిన్ = కోరి; పొడసూపు = ఉదయించు; భాగవత = భగవద్భక్తుల ఎడ; అనురక్తిన్ = ప్రీతి; చేసి = వలన; భవదీయ = నీ యొక్క; మహిమంబు = గొప్పదనము; చిత్రము = విచిత్రము; అరయన్ = చూచుటకు; చిరశుభాకార = హరి {చిరశుభాకారుడు - చిర (మిక్కిలి) శుభమైన ఆకారము కలవాడు, విష్ణువు}; ఇందిరాచిత్తచోర = హరి {ఇందిరాచిత్తచోరుడు - ఇందిర (లక్ష్మీదేవి) చిత్తము (మనసును) చోరుడు (దోచుకొన్నవాడు), విష్ణువు}.

భావము:

లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడు సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాలనుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలె ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసిమాలలు కల నీ పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా....కృపాకటాక్షములు పొంగిపొరలగా పొడచూపే భాగవతులమీద అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది. కమలాక్షా! నిత్యశుభాకారా! లక్ష్మీమనోహరా! నీ మహిమ చిత్రమైనది.