పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-572-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిఁ దలపోయ నెవ్వని సగ్ర పరిగ్రహమున్ లభింప ని
స్పృమతులై మునీశ్వరులు మృత్యు భయంబునఁ బాతు రట్టి స
న్మహిత వివేకశాలి! గుణమండన! నీ కిల నన్య సత్పరి
గ్ర మది యెట్టి చోద్యము జత్పరిపాలన! నిత్యఖేలనా!

టీకా:

మహిన్ = భూమిన్; తలపోయన్ = పరిశీలించిన; ఎవ్వని = ఎవరి; సమగ్ర = సంపూర్ణమైన; పరిగ్రహమున్ = అనుగ్రహమును; లభింపంన్ = పొందగా; నిస్పృహ = విరక్తి కల, వైరాగ్యము కల; మతులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ముని = మునులలో; ఈశ్వరులు = శ్రేష్ఠులు; మృత్యు = మరణ; భయంబునన్ = భయము నుండి; పాతురు = తొలగుదురో; అట్టి = అటువంటి; సన్మహితవివేకశాలి = నారాయణ {సన్మహిత వివేకశాలి - మంచి మరియు గొప్ప వివేకము కలవాడు, విష్ణువు}; గుణమండన = నారాయణ {గుణ మండనుడు - సుగుణములు అలంకారముగా కలవాడు, విష్ణువు}; నీకున్ = నీకు; ఇలన్ = భూమిమీద; అన్య = ఇతరుల; సత్పరిగ్రహము = అనుగ్రహమా; అది = అది; ఎట్టి = ఎలాంటి; చోద్యము = విచిత్రము; జగత్పరిపాలన = నారాయణ {జగ త్పరిపాలనుడు - జగత్ (విశ్వము)ను పరిపాలించువాడు, విష్ణువు}; నిత్యఖేలనా = నారాయణ {నిత్య ఖేలనుడు - నిత్య (శాశ్వతమైన) ఖేలన (వర్తన) కలవాడు, విష్ణువు}.

భావము:

దేవా! మంచి వివేకం కలవాడా! గుణభూషణా! లోకపాలకా! నిత్యవినోదీ! ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారై మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకంలో మరొకరి అనుగ్రహమా? ఎంత వింత!