పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-571-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లదళాక్ష! నీవలన ల్గిన ధర్మము దావకావతా
ముల సురక్షితం బగుఁ దిరం బగు నీశ్వర! నిర్వికారత
త్వమునఁ దనర్చు నిన్నరయఁ త్ఫలరూపముఁ దత్ప్రధానగో
ప్యము నని పల్కుచుందురు కృపామయలోచన! పాపమోచనా!

టీకా:

కమలదళాక్షా = నారాయణ {కమల దళాక్షుడు - కమలముల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; నీ = నీ; వలన = వలన; కల్గిన = కలిగిన; ధర్మము = ధర్మము; తావక = నీ యొక్క; అవతారముల = అవతారముల వలన; సురక్షితంబున్ = బాగుగా రక్షింపబడినది; అగున్ = అగును; తిరంబు = స్థిరమైనది; అగు = అగును; ఈశ్వర = నారాయణుని {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు, విష్ణువు}; నిర్వికార = వికారరహితమైన {నిర్వికారము - వికారము (మార్పు) లేనిది}; తత్వమునన్ = లక్షణములతో; తనర్చు = ఉన్నతమైన; నిన్ను = నిన్ను; అరయన్ = పరిశీలించిచూడగా; తత్ = దాని; ఫల = ఫలితము యొక్క; రూపమున్ = స్వరూపమును; తత్ = దాని; ప్రధాన = ముఖ్య; గోప్యమున్ = రహస్యము; అని = అని; పల్కుచున్ = అనుచూ; ఉందురు = ఉందురు; కృపామయలోచన = నారాయణ {కృపా మయ లోచనుడు - కృప (దయ) మయ (తో) కూడిన లోచనుడు (కన్నులు కలవాడు, విష్ణువు}; పాపమోచన = నారాయణ {పాప మోచనుడు - పాపమునుండి మోచనుడు (ముక్తిని ప్రసాదించువాడు), విష్ణువు}.

భావము:

కమలనయనా! నీవలన ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా! దయామయా! పాపవిమోచనా! మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమనీ, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమనీ చెప్తూ ఉంటారు.