పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-570-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేగణాళి కెల్లఁ పరదేవతలై తనరారు నట్టి వి
ప్రాలి కాత్మనాయకుఁడవై పెనుపొందిన నీకు నీ ధరా
దేత లెల్ల నెన్న నధిదేవత లైరఁట యెట్టి చోద్యమో?
దే! సమస్తపావన! సుధీజనతావన! విశ్వభావనా!

టీకా:

దేవ = దేవతల; గణాళి = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = సమస్తమునకు; పర = ఉత్తమమైన; దేవతలు = దేవతలు; ఐ = అయ్యి; తనరారున్ = విజృంభించు; అట్టి = అటువంటి; విప్ర = బ్రాహ్మణుల; ఆవలి = సమూహముల; కిన్ = కి; ఆత్మ = స్వంత, మానసిక; నాయకుడవు = నాయకుడవు; ఐ = అయ్యి; పెనుపొందిన = అతిశయించిన; నీకున్ = నీకు; ఈ = ఈ; ధరాదేవతలు = బ్రాహ్మణులు {ధరాదేవతలు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఎల్లన్ = అందరును; ఎన్నన్ = ఎంచిచూసిన; అధిదేవతలు = పరదేవతలు; ఐరట = అయినారట; యెట్టి = ఏమి; చోద్యమో = విచిత్రమో కదా; దేవ = నారాయణ; సమస్తపావన = నారాయణ {సమస్త పావనుడు - సమస్తమును పావనము చేయువాడు, విష్ణువు}; సుధీజనతావన = నారాయణ {సుధీజనతావనుడు - సుధీ (మంచి)జనతా (జనుల యొక్క) అవనుడు (రక్షకుడు), విష్ణువు}; విశ్వభావనా = నారాయణ {విశ్వ భావనుడు - విశ్వము అను భావము తానైనవాడు, విష్ణువు}.

భావము:

దేవా! నీవు పరమపావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు. దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయడవైన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవత లైనారట. ఎంత చోద్యం!