పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-569-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పొలుపు దీపింప నిత్యవిభూతి నాయ
కుడవు భగవంతుడవు ననఘుడవు నీవు
త్కృతంబిప్డు నీకభిత మటంటి
వీశ భవదీయ చారిత్ర మెఱుఁగఁ దరమె.

టీకా:

పొలుపున్ = చక్కగ; దీపింపన్ = ప్రకాశించు; నిత్య = శాశ్వత; విభూతి = ఐశ్వర్యము కల; నాయకుడవు = నడిపించువాడవు; భగవంతుడవు = మహిమాన్వితుడవు; అనఘుడవు = దోషము లేనివాడవు; నీవు = నీవు; మత్ = మాచేత; కృతంబు = చేయబడినది; ఇప్డు = ఇప్పుడు; నీకున్ = నీకు; అభిమతంబున్ = అంగీకారము; అటన్ = అని; అంటివి = అన్నావు; ఈశ = నారాయణ {ఈశ - ఈశ్వరుడు, విష్ణువు}; భవదీయ = నీ; చారిత్రమున్ = వర్తనలను; ఎఱుగన్ = తెలిసికొనుట; తరమే = సాధ్యమా ఏమి.

భావము:

“దేవా! తేజోవంతమైన నిత్యైశ్వర్యం కల నాయకుడవు, భగవంతుడవు, పుణ్యమూర్తివి. మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలిసికొనడం ఎవరికి సాధ్యం?