పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-568-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిత నిజ యోగమాయా
స్ఫుణం దనరారు నతివిభూతియు బలముం
మోత్కర్షముఁ గల యీ
శ్వరునకు నిట్లనిరి మునులు ద్వినయమునన్.

టీకా:

భరిత = నిండైన; నిజ = తన; యోగమాయా = యోగమాయ యొక్క; స్ఫురణన్ = ప్రకటత్వముతో; తనరారు = విలసిల్లు; అతి = మహా; విభూతి = వైభవము; బలమున్ = బలమును; పరమ = అత్యధికమైన; ఉత్కర్షమున్ = శ్రైష్ఠ్యమును; కల = కలిగినట్టి; ఈశ్వరున్ = నారాయణున; కున్ = కి; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; మునులు = మునులు; సత్ = మంచి; వినయమునన్ = వినయముతో.

భావము:

స్వయంగా కల్పించుకున్న యోగామాయాప్రభావం వల్ల విలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు.