పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-567-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లినాక్షుఁడు దమదెసఁ గృప
లిగిన భావంబుఁ దెలిసి కౌతుకమొలయం
బుకాంకితాంగులై యు
త్కలికన్ హర్షించి నిటలటితాంజలులై.

టీకా:

నలినాక్షుడు = నారాయణుడు {నలినాక్షుడు - నలినము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు , విష్ణువు}; తమ = తమ; దెసన్ = వైపు; కృపన్ = దయ; కలిగిన = కలిగినట్టి; భావంబున్ = అభిప్రాయమును; తెలిసి = అర్థము చేసుకొని; కౌతుకమున్ = కుతూహలము; ఒలయన్ = పుట్టగా; పులకాకింత = పులకరించిన; అంగులు = దేహములు కలవారు; ఐన = అయ్యి; ఉత్కలికన్ = ఉత్కంఠముతో; హర్షించి = సంతోషించి; నిటల = నుదుట; ఘటిత = ఉంచిన; అంజలులు = చేమోడ్పులు కలవారు; ఐ = అయ్యి.

భావము:

హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసికొని, కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారై ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి....