పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-565-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పొలుచు నా మానసాంభోజాత భావంబు-
దెలియంగలేక యుద్వృత్తు లగుచుఁ
డఁగి నా యానతిఁ డచినఁ దద్దోష-
లము వీరలకు సంప్రాప్త మయ్యె
మునులార! నా చిత్తమున నున్న నీతియు-
నిట్టిద భూమిపైఁ బుట్టి వీర
చిరకాలమున నా యంతికంబున కోలి-
రుదెంచునట్లుగా నుమతింప

3-565.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లయు" నని యమ్ముకుందుడు లుకుటయును
విని మనంబున సనకాది మునివరేణ్యు
మ్మహాత్ముని మృదుల భాషామృతంబుఁ
విలి క్రోలియు రోష సంష్టు లగుచు.

టీకా:

పొలుచు = ప్రకాశించు; నా = నా యొక్క; మానస = మానసము అను; అంభోజాత = పద్మమునందలి {అంభోజాతము -నీటిలో జాతము (పుట్టినది), పద్మము}; భావంబు = అభిప్రాయమును; తెలియంగ = తెలిసికొన; లేక = లేకపోవుటచే; ఉత్ = మిడిసిపడు; వృత్తులు = వర్తనలు కలవారు; అగుచున్ = అవుతూ; కడగి = చివరకు; నా = నా యొక్క; ఆనతిన్ = ఆజ్ఞను; కడచినన్ = దాటినట్టి; తత్ = ఆ; దోష = తప్పు యొక్క; ఫలమున్ = ఫలితము; వీరల = వీరి; కున్ = కి; సంప్రాప్తము = చక్కగ కలిగినది; అయ్యెన్ = అయినది; మునులార = మునులూ; నా = నా యొక్క; చిత్తమునన్ = మనసులో; ఉన్న = ఉన్నట్టి; నీతియున్ = న్యాయము కూడ; ఇట్టిద = ఇటువంటిదే; భూమి = భూమి; పైన్ = మీద; పుట్టి = పుట్టి; వీరలు = వీరు; అచిర = కొద్ది {అచిర - ఎక్కువ కానిది, కొద్ది}; కాలమునన్ = కాలములోనే; నా = నా యొక్క; అంతికంబునన్ = సమీపమున; కున్ = కి; ఓలిన్ = సురక్షితముగ; అరుగుదెంచున్ = తిరిగివచ్చు; అట్లుగా = విధముగా; అనుమతింపన్ = అంగీకరింప; వలయున్ = వలసినది; అని = అని;
ఆ = ఆ; ముకుందుడు = విష్ణుమూర్తి; పలుకుటయును = చెప్పుటను; విని = విని; మనంబునన్ = మనసులో; సనక = సనకుడు; ఆది = మొదలగు; ముని = మునులలో; వరేణ్యుల్ = శ్రేష్ఠులు; ఆ = ఆ; మహాత్మునిన్ = మహాత్ముడిని; మృదుల = మృదువైన; భాషా = పలుకులు అను; అమృతంబున్ = అమృతమును; తవిలి = ఆసక్తిగా; క్రోలియున్ = తాగినప్పటికిని; రోషన్ = రోషముచేత; సందష్టులు = బాగాకాటువేయబడినవారు; అగుచున్ = అవుతూ.

భావము:

మునులారా! నా హృదయకమలంలోని అభిప్రాయాన్ని వీళ్ళు తెలిసికొనలేక మీ ఆజ్ఞను మీరిన దోషానికి తగిలఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా ఇదే. వీళ్ళు భూమిపై పుట్టి కొద్దికాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేటట్లు అనుమతించండి.” అని ఆ ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచిచూచి కూడా కోపాన్ని విడువలేనివారై...