పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-558-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిసురోత్తమసేవా
రిలబ్ధం బయిన యట్టి పాతక నాశం
నిఖిలభువన పూత
స్ఫురితాంఘ్రిసరోజ తోయములు గల నన్నున్.

టీకా:

ధరణీసుర = బ్రహ్మణులలో {ధరణీసురులు – భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; ఉత్తమ = ఉత్తముల; సేవా = సేవించుటవలన; పరి = చక్కగా; లబ్ధ = లభించినది; అయిన = అయిన; అట్టి = అటువంటి; పాతక = పాపములను; నాశంకర = నాశనము చేయునట్టి; నిఖిల = సమస్తమైన; భువన = లోకములను; పూత = పవిత్రముచేయునట్టి; స్ఫురితన్ = ఉద్భవించినట్టి; అంఘ్రి = పాదములు అనెడి; సరోజ = పద్మముల {సరోజము - సరసున జము (పుట్టినది), పద్మము}; తోయము = గంగ; కల = ఉన్నట్టి; నన్నున్ = నన్ను.

భావము:

సకల పాపములను శమింపజేయ గలది, సమస్త లోకాలను పవిత్రం జేయగలదీ అయిన గంగకు జన్మస్థానమైనట్టివి మఱియు బ్రాహ్మణశ్రేష్ఠులను సేవించుట వలన లభించెడివి అయిన నా పాదపద్మ యుగము కలిగిన నన్ను. . .