పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-557-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నేను దలంప మీ ట్టి సాధు
నుల కపకార మర్థిఁ జేసి మదీయ
బాహుసము లైనఁ ద్రుంతు నుత్సాహలీల
న్న నితరుల మీ మ్రోల నెన్న నేల?

టీకా:

అట్టి = అటువంటి; నేను = నేను; తలంప = పరిశీలించిన; మీ = మీ; అట్టి = లాంటి; సాధు = సాధుస్వభావులైన; జనుల్ = జనుల; కున్ = కు; అపకారము = కీడు; అర్థిన్ = కోరి; చేసిన = చేసినట్టి; మదీయ = నా యొక్క; బాహు = చేతులకు; సముల్ = సమానమైనవారు; ఐనన్ = అయినప్పటికి; త్రుంతును = ఖండింతును; ఉత్సాహ = వీరత్వపు; లీలన్ = విధముగ; అన్నన్ = అంటే; ఇతరులన్ = మిగతావారి గురించి; మీ = మీ; మ్రోలన్ = ముందర; ఎన్నన్ = ఎంచి చూచుట; ఏలన్ = ఎందులకు.

భావము:

అటువంటి నేను మీవంటి సాధుజనులకు అపకారం చేసినవారు నాకు బాహువులవంటి వారైనా ఖండించడానికి వెనుకాడను. ఇంక ఇతరులను మీముందు లెక్కచేయడ మెక్కడిది?